కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. హైకోర్టు స్టే కారణంగా మెట్‌పల్లి మున్సిపాలిటీకి ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. గురువారంనాడు ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుంది. అయితే మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను చేపట్టడానికి 13 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. శాసనసభ్యుడు కొమిరెడ్డి రాములు ఓటుతో కలుపుకుంటే కాంగ్రెస్‌కు 12 ఓట్ల బలం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 5, తెలుగుదేశం 3, బిజెపి 4 వార్డులు గెలుచుకుంది. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. తెరాస సహకారంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను దక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే తమ సొంతంగానే చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులను గెలుచుకోగలమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి కొమిరెడ్డి జ్యోతి అంటున్నారు.












Click it and Unblock the Notifications