నరేంద్ర వ్యాఖ్యలు పట్టించుకోవద్దు: సంతోష్
హైదరాబాద్: తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో అమెరికా వెళ్లిన ఆయన గురువారం ఉదయం ఇక్కడికి తిరిగి వచ్చారు. తాను అసమ్మతితో అమెరికా వెళ్లానని అనడంలో నిజం లేదని ఆయన అన్నారు. అనారోగ్యకారణాల వల్ల చికిత్స నిమిత్తం తాను అమెరికా వెళ్లానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. నరేంద్రపై తమ పార్టీ శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు వమిర్శలు చేయడం వెనక తాను లేనని ఆయన స్పష్టం చేశారు. వారు విమర్శలు చేయడం వెనక తన ప్రోద్బలం ఉందనే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాజకీయ పార్టీలు సవాళ్లు విసురుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఇబ్బంది ఎదుర్కున్నదని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే సంతోష్ రెడ్డిని మందాడి సత్యనారాయణ రెడ్డి కలుసుకున్నారు. తన భేటీ వెనక ఏ విధమైన రాజకీయం లేదని మందాడి సత్యనారాయణ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మర్యాద పూర్వకంగా కలిశానని ఆయన స్పష్టం చేశారు. సంతోష్ రెడ్డితో ఏమైనా మాట్లాడారా అని అడిగితే "ఇప్పుడే వచ్చారు కదా, ఏం మాట్లాడతాం, సభకు వస్తారు కదా అని సమాధానమిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలని ఎన్నికల సమయంలో సంతోష్ రెడ్డి అమెరికా నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications