అమర్ కుటుంబాన్ని ఆదుకుంటాం: జానారెడ్డి
హైదరాబాద్: నక్సలైట్ల మందుపాతరలకు బలైన సిఆర్‌పియఫ్ జవాను అమర్ అంత్యక్రియలకు రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అమర్ జార్ఖండ్‌లో నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు బలయ్యారు. జార్ఖండ్‌లో నక్సలైట్లు మందుపాతర పేల్చిన సంఘటనలో 12 మంది జవాన్లు మరణించారు. అమర్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. ఆయన అంత్యక్రియలు సోమవారంనాడు జరిగాయి.
అమర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి జానా రెడ్డి చెప్పారు. తీవ్రవాదుల దుశ్చర్యలకు దేశరక్షణకు అంకితమైన అమర్ బలి కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సమాజ పరిరక్షణ కోసం పనిచేస్తున్నవారిని నక్సలైట్లు చంపడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
