పోతిరెడ్డిపాడు జీవోలని పదాలు తీసేయాలి: సిపిఐ
హైదరాబాద్: రాయలసీమలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు కృష్ణా జలాలను తరలించే 170 నెంబర్ ఉత్తర్వులోని అపార్థాలు కలిగించే పదాలను తొలగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. జీవోలోని కొన్ని పదాలను అపార్థాలను కలిగించే విధంగా ఉన్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అంశంపై శాసనసభలో చర్చ జరిగినా పరిష్కారం మాత్రం లభించలేదని, దాని వల్ల జలాల వివాదంతో రాజకీయాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
ఆర్టీసి సమ్మెను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పాల్గొనే ఆలోచన ఉన్నదని ఆయన చెప్పారు. అయితే అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన ప్రతిపాదన రాలేదని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి వ్యూహం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, అదే స్ఫూర్తితో సహకార సంఘాల ఎన్నికల్లో పాల్గొనాలనేది తమ ఆలోచన ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
