వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద హింసకు తాత్కాలిక తెర
శ్రీనగర్: భూకంప తీవ్ర దృష్ట్యా జమ్మూ కాశ్మీర్‌లో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిహాద్ కౌన్సిల్ ప్రకటించింది. జిహాద్ కౌన్సిల్ 14 మిలిటెంట్ సంస్థలతో ఏర్పడిన సంస్థ. కౌన్సిల్ చైర్మన్, హిజ్బుల్ ముజాహిదీన్ సుప్రీం కమాండర్ సయ్యద్ సలావుద్దీన్ ముజాహిదీన్ అధ్యక్షతన ముజఫరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వార్తా సంస్థ ఒకటి తెలియజేసింది. తమకు అందిన ఫాక్స్ సమాచారాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ సోమవారం ఆ విషయం తెలియజేసింది. భూకంప తాకిడి ప్రాంతాల్లో కార్యకలాపాలను ఆపేసి, బాధితులకు సహాయం అందించాలని సలావుద్దీన్ కౌన్సిల్ భాగస్వామ్య సంస్థలను కోరారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!