అసెంబ్లీ కాలాన్ని మింగేసిన పోతిరెడ్డిపాడు: రోశయ్య
ఒంగోలు: పోతిరెడ్డిపాడు హెడ్యులేటర్‌పై అన్ని పార్టీలు పట్టుబట్టి చర్చను కొనసాగించడం వల్ల శాసనసభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోయాయని శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి కె. రోశయ్య అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై చర్చ శాసనసభా సమయాన్ని వృధా చేసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌పై సుదీర్ఘంగా చర్చ కొనసాగించడం వల్ల 21 అంశాలు చర్చ జరగకుండానే ఆమోదం పొందాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని మార్చుకోకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ సహకరించడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
