ముగ్గురు ఐపియస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐపియస్ అధికారులను బదిలీ చేసింది. బి. ప్రసాదరావును ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్ అదనపు డిజిపిగా నియమించింది. ఆర్.పి. సింహ్ ట్రైనింగ్ అదనపు డిజిపిగా నియమితులయ్యారు. ఎన్. సంజయ్‌ను అనంతపురంలోని శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించింది.
భారీగా ఐపియస్ అధికారుల బదిలీలు జరగవచ్చునని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ట్రాన్స్‌పోర్ అదనపు కమీసనర్‌గా ఉన్న ఎ.కె. ఖాన్‌ను సైబరాబాద్ కమీషనర్‌గా బదిలీ చేయవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలో ఉన్న మహేందర్ రెడ్డిని గ్రేహౌండ్స్‌కు మార్చవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications
