సాగునీటి వల్ల క్రీడలకు తక్కువ నిధులు: ఎమ్మెస్
రాజమండ్రి: సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించలేకపోతున్నామని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. అయినా క్రీడలకు నిధులు పెంచి పిల్లలకు ప్రోత్సాహం అందించడానికి ప్రయత్నాలు చేస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జిల్లా కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని, మండల కేంద్రాల్లో మినీ క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీట్లు సరిగా లేని, ఎసి లేని సినిమా థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
