రైతులకు నష్టపరిహారానికి ముద్రగడ దీక్ష
కాకినాడ: రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం నిరాహదీక్ష చేపట్టారు. ఆయన దీక్ష గురువారంనాడు రెండో రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో గల తన నివాసంలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో రైతులు, అభిమానులు ఆయన నివాసానికి పెద్ద యెత్తున వస్తున్నారు.
పార్టీ నాయకత్వం సూచన మేరకు బిజెపి నాయకుడు సర్వారాయుడు ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించి మద్దతు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ముద్రగడ దీక్షపై మాట్లాడటం లేదు. తాను తెలుగుదేశం నాయకుల మద్దతు కోరలేదని, వారు మద్దతిస్తే తీసుకుంటానని దీక్ష ప్రారంభించడానికి ముందే ముద్రగడ పద్మనాభం అన్నారు. 14 గ్రామాల రైతుల ప్రయోజనాల కోసం తాను దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
