ప్రధాని మన్మోహన్ కుడిచేతికి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుడిచేతికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆయనకు గురవారంనాడు ఈ శస్త్రచికిత్స జరిగింది. మణికట్టు వద్ద గల నరంపై ఒత్తిడిని తగ్గించడానికి వైద్యులు ఈ శస్త్రచికిత్స చేసినట్లు ప్రధాని మీడియా సలహాదారు సంజయబారు ఒక ప్రకటనలో తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం ప్రధాని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన యధావిధిగా తన విధులను నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల పాటు శస్త్రచికిత్స జరిగిన కుడిచేతికి కట్టు ఉంటుందని సంజయబారు చెప్పారు. అయినా ప్రధాని యధావిధిగా పని చేసుకుంటూ పోతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
