తీవ్రవాదుల తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్: ఐయస్‌ఐ తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తూ తమకు చిక్కకుండా తిరుగుతున్నవారి కుటుంబ సభ్యులకు పోలీసులు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. హైదరాబాద్ అదనపు పోలీసు కమీషన్ రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో ఈ కౌన్సెలింగ్ జరిగింది. ఐయస్‌ఐ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న యెజ్దాని, షాహిద్, అబ్దుల్ అజీజ్ తల్లిదంద్రులకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు.
తప్పు చేశామని ఒప్పుకుంటూ తమకు లొంగిపోయినవారికి క్షమాబిక్ష పెట్టే విషయాన్ని పరిశీలిస్తామని రాజీవ్ త్రివేది తీవ్రవాదుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. హింసా మార్గం వల్ల ఒరిగేదేమీ ఉండదని గ్రహించాలని ఆయన అన్నారు. కొన్ని దుష్టశక్తుల ప్రమేయం వల్ల యువకులు పెడదారి పడుతున్నారని, వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
