ఇద్దరు నీలోఫర్ స్టాఫ్‌నర్సుల సస్పెన్షన్
హైదరాబాద్: హైదరాబాద్‌లో గల నీలోఫర్ ఆస్పత్రిలోని ఇన్‌క్యుబేటర్‌లో ఒక పసిపాప మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేశారు. నీలోఫర్ ఆస్పత్రిలోని ఇన్‌క్యుబేటర్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఒక పసిపాప మరణించింది. మరో నలుగురు పసిపాపలను ప్రాణాలతో రక్షించగలిగారు.
నీలోఫర్ ఆస్పత్రి సంఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని, సంఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు వినోదిని, సాయివాణిలను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
