సిపియంకు ఆ వాసనలు పోలేదు: వైయస్
హైదరాబాద్: సిపియంకు తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసినప్పటి వాసనలు పోలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సాగునీటి టెండర్లలో ప్రభుత్వానికి వేయి కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు చేసిన ఆరోపణపై ఆయన బుధవారంనాడు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశంతో వామపక్షాలు స్నేహం చేసినప్పడు అమలైన అవినీతే ఇప్పుడు కూడా కొనసాగుతోందని సిపియం భ్రమిస్తోందని ఆయన మీడియా ప్రతినిధురలతో అన్నారు.
వామపక్షాలు తప్పుకున్నా కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. వామపక్షాలు ప్రభుత్వంలో భాగస్వాములు కావని, అందువల్ల తమ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాయని, తమ విధానాలు పద్ధతుల ప్రకారం వ్యవహరిస్తుంటాయని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ స్నేహ హస్తం చాస్తున్న నేపథ్యంలో మీతో తెగదెంపులు చేసుకోవడానికి వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు తాను అలా అనుకోవడం లేదని, కేంద్రంలో తమతో వామపక్షాలు కలిసి ఉన్నాయని ఆయన జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications
