వ్యవసాయానికి ఐటి ద్వారానే నిష్కృతి: రఘువీరా
హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీయే సంకటస్థితి నుంచి బయటపడేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ఐటి పాత్ర అనే అంశంపై ఏర్పాటయిన సదస్సులో ఆయన గురువారంనాడు ప్రారంభించారు. ప్రతి రైతూ ఒక శాస్త్రవేత్త కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమగ్ర పంటల విధానాన్ని రూపొందించడంలో విఫలమయ్యామని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు సరైన పంటల విధానం లేదని, సమగ్ర పంటల విధానం లేనంత వరకు ఫలితాలు రావని, ప్రస్తుతం వ్యవసాయ రంగం సంకటస్థితిలో ఉందని ఆయన అన్నారు. పంటల విధానం లేనంత వరకు ఎన్ని నీళ్లిచ్చినా, విత్తనాల కొత్త వంగడాలిచ్చినా ఫలితం ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
