మతం మారుతా: మోనికా బేడీ

హైదరాబాద్‌: తాను మతం మార్చుకుంటానని సినీనటి, అండర్‌వరల్డ్‌ డాన్‌ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడి చెప్పారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో రిమాండ్‌ గడువు ముగియడంతో ఆమెను గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె ఈ విషయం చెప్పారు. ఇక్కడి మహిళా జైలులో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని ఆమె అన్నారు.

తన ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో కోర్టు హాల్‌లో కూర్చోవడానికి మోనికా బేడికి కోర్టు అనుమతి ఇచ్చింది. మోనికా బేడీ జ్యుడిష్యల్‌ రిమాండ్‌ను కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. ఈ నెల 25వ తేదీ లోగా అబూ సేలంను కూడా తమ ముందు హాజరు పరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మోనికా బేడీ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సిబిఐ ఈ నెల 18వ తేదీ వరకు కోర్టు గడువు ఇచ్చింది. అదే రోజు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+