వైయస్ చేతిలో నక్సల్స్ సమస్య అలాగే: బాలగోపాల్
విశాఖపట్నం: డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నక్సల్స్ సమస్య పరిష్కారం కాదని మానవ హక్కుల వేదిక నాయకుడు కె. బాలగోపాల్ అన్నారు. సమస్యకు ప్రభుత్వ విధానాలతో పాటు నక్సల్స్ చర్యలు కూడా కారణమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నక్సల్స్ సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించామని, అయితే లాభం లేకపోయిందని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిర్వాకం వల్లనే చర్చలు విఫలమయ్యాయని, అందువల్ల చర్చల పునరుద్ధరణకు ప్రభుత్వమే ముందుకు రావాలని ఆయన అన్నారు. ముందుగా కాల్పుల విరమణను ప్రకటించి బేషరతుగా నక్సల్స్‌ను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నక్సల్స్ కూడా బెట్టు చేయకుండా చర్చలకు ముందుకు రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
