ఎక్సైజ్ పోలీసులు చేతిలో మహిళ మృతి?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ మరణంపై ఆ స్త్రీ బంధువులు ఆందోళనకు దిగారు. సరూర్‌నగర్ పోలీసులు బుజ్జి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె శనివారం సాయంత్రం మరణించింది. ఆమె శవాన్ని హడావిడిగా పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఇది తెలిసిన మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులే బుజ్జిని చంపారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడి వుంటారని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చారు. సంఘటనపై విచారణ జరిపిస్తామని ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటిండెంట్ అంటున్నారు.












Click it and Unblock the Notifications
