ఏకాభిప్రాయం కుదిరితేనే తెలంగాణపై ప్రకటన
గుంటూరు: పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే తెలంగాణపై తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ సభ్యుడు రఘువంశ ప్రసాద్ సింగ్ చెప్పారు. కాలచక్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం అమవరాతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ।పతినిధులతో మాట్లాడారు. ఏకాభిప్రాయ కుదరనంత వరకు తెలంగాణపై తమ అభిప్రాయం ప్రకటించడం సరైంది కాదని ఆయన అన్నారు.
తెలంగాణపై వైఖరి తెలియజేయాలని అన్ని పార్టీలకు తాము లేఖలు రాశామని, కొన్ని పార్టీలు జవాబులు రాశాయని, మరికొన్ని పార్టీలు ఇంకా రాయలేదని ఆయన చెప్పారు. తమకు జవాబు లేఖలు రాసిన పార్టీల్లో కొన్ని తెలంగాణను వ్యతిరేకిస్తున్నాయని, కొన్ని సమర్థిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కార్యక్రమాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా తెలంగాణపై తమ సబ్ కమిటీ పనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
