వంశధారపై ఒరిస్సా వాదన తప్పు: ధర్మాన
శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టుపై ఒరిస్సాతో ఏ విధమైన విభేదాలు లేవని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వంశధార ప్రాజెక్టుకు గత ఒప్పందాల ప్రకారం 35 టియంసిల నీటినే వాడుకుంటున్నామని, దీని వల్ల ఒరిస్సాకు ఏ విధమైన నష్టం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవసరమైతే ఒరిస్సాకు మంత్రుల బృందాన్ని పంపుతామని ఆయన చెప్పారు.
నదుల అనుసంధానం ద్వారా వంశధార నీటిని మొత్తాన్ని తామే వాడుకుంటామని ఒరిస్సా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. వంశధార మొత్తం నీటిపై ఒరిస్సాకు హక్కు లేదని, అందులో ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఉందని ఆయన అన్నారు. మన హక్కుల మేరకే వంశధార ప్రాజెక్టుకు నీటిని వాడుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
