గోదావరి తీరంలో పరుగుల ఉత్సాహం

తాడేపల్లిగూడెం: గోదావరి తీరంలో గురువారంనాడు పరుగుల వరద పారింది. రాజమండ్రిలో 5కె రన్‌, తాడేపల్లిగూడెంలో 7కె రన్‌ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

తారల, క్రీడాకారుల తళుకుబెళుకులతో 7 కె రన్‌ తాడేపల్లిగూడెంలో గురువారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ రన్‌లో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రధాన వీధుల గుండా ఈ రన్‌ సాగింది. సినీనటులు రంభ, ఎం.యస్‌. నారాయణ, దర్శకుడు వి.వి. వినాయక్‌, క్రీడాకారులు అజహరుద్దీన్‌, ముఖేష్‌కుమార్‌, ఎ.టి. రాయుడు తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రిలో 5కె రన్‌ జరిగింది. ప్రముఖ సినీనటుడు సుమన్‌ ఈ రన్‌ను ప్రారంభించారు. పుష్కరఘాట్‌ నుంచి ప్రారంభమైన ఈ రన్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంది. అనంతరం అక్కడ జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పొల్గొన్నారు. ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఈ కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+