బూటాను సాగనంపాలని కోర్ కమిటీ నిర్ణయం
న్యూఢిల్లీ: మొండికేసిన బీహార్ గవర్నర్ బూటాసింగ్‌ను సాగనంపాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో గురువారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై బూటాసింగ్ వ్యవహారంపై చర్చించింది. బూటాసింగ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని హోం మంత్రి శివరాజ్ పాటిల్ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తాను తప్పుకునే ప్రస్తకి లేదని బూటాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనను సాగనంపడం తప్ప మరో మార్గం లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే బూటాసింగ్ తన పంతం నెగ్గించుకున్నారు. రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను ఆవిష్కరించి తీరుతానని ఆయన ప్రకటించి దాన్ని నెరవేర్చుకున్నారు. బీహార్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications