స్వామి పరమానందతీర్థ అస్తమయం
హైదరాబాద్: రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరమానంద తీర్థ గురువారం సాయంత్రం అస్తమించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి హృదయ సంబంధ నాళాల సమస్యలు తలెత్తాయి. దానికి తోడు మధుమేహం తిరగబెట్టడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా పరమానంద తీర్థ కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని కార్యక్రమాలను పరమానంత తీర్థ విస్తృత పరిచారు. ఆయన భౌతిక కాయాన్ని రామకృష్ణ మఠానికి తరలిస్తారు. రేపు బన్సీలాల్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications