పోలవరం సమావేశం నుంచి సిపియం, తెరాస వాకౌట్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నుంచి సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వాకౌట్ చేశాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రెండు పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాలు సూచించేందుకు మరో నిపుణుల కమిటీని వేయాలని సిపియం డిమాండ్ చేసింది. ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో సిపియం వాకౌట్ చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని తెరాస డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications