నర్మదా పనులు కొనసాగించాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేకపోతే పనులు ఆపేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటువంటి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులయ్యే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణానికి, పునరావస కల్పనకు మధ్య సమతౌల్యాన్ని పాటించాలని కూడా సూచించింది.
నిర్వాసితులకు కల్పించిన పునరావాస కార్యక్రమాలపై సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాలకు వారం రోజుల గడువు ఇచ్చింది. పునరావాస కార్యక్రమాలను మూడు నెలల లోగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. ఆనకట్ట ఎత్తును 110 మీటర్ల నుంచి 122 మీటర్లకు పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నర్మదా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరుతూ నర్మదా బచావో ఆందోళన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 1వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications