వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడి కాల్పులు: మహాజన్‌కు తీవ్ర గాయాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నేత ప్రమోద్‌ మహాజన్‌పై ఆయన సోదరుడు ప్రవీణ్‌ మహాజన్‌ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ మహాజన్‌ను హిందూజా ఆస్పత్రిలో చేర్చారు. కట్టలు తెంచుకున్న ఆవేశంలో ప్రవీణ్‌ మహాజన్‌ అతి సమీపం నుంచి ప్రమోద్‌ మహాజన్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో ప్రమోద్‌ మహాజన్‌ పొట్టలోకి, ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రమోద్‌ మహాజన్‌ శరీరం నుంచి వైద్యులు బుల్లెట్లను వెలికి తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రమోద్‌ మహాజన్‌ మాట్లాడుతున్నారని కూడా వారు చెప్పారు. ఈ సంఘటనతో బిజెపి సీనియర్‌ నేతలు ఎల్‌.కె. అద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ తమ తమ రథయాత్రలను రద్దు చేసుకుని ముంబాయి బయలుదేరి వెళ్లారు. కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకుని వెంకయ్యనాయుడు కూడా ముంబాయికి బయలుదేరారు.

ప్రమోద్‌ మహాజన్‌పై కాల్పులు జరిపిన సోదరుడు ప్రవీణ్‌ మహాజన్‌ వర్లి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. థానే నుంచి ముంబాయి వచ్చిన ప్రవీణ్‌ మహాజన్‌ సోదరుడు ప్రమోద్‌ మహాజన్‌తో ఆస్తి విషయంపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆవేశాన్ని తట్టుకోలేక ప్రవీణ్‌ మహాజన్‌ సోదరుడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ప్రవీణ్‌ మహాజన్‌ వాంగ్మూలాన్ని వర్లి పోలీసులు నమోదు చేసుకున్నారు. ప్రవీణ్‌ మహాజన్‌పై పోలీసులు 307 కింద కేసు నమోదు చేశారు.

ప్రమోద్‌ మహాజన్‌ను శస్త్రచికిత్స అనంతరం ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ప్రమోద్‌ మహాజన్‌ను 72 గంటల పాటు పరిశీలనలో ఉంచుతామని వైద్యులు చెప్పారు. ప్రమోద్‌ మహాజన్‌ కాలేయానికి ఒక తూటా తగిలింది. ఇది ఆస్తి వివాదం కాదని ప్రమోద్‌ మహాజన్‌ సోదరుడు ప్రకాశ్‌ మహాజన్‌ చెప్పారు. ప్రమోద్‌ మహాజన్‌ తండ్రి వెంకటేశ్‌ మహాజన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. ముగ్గురు కుమారుల్లో ప్రమోద్‌ మహాజన్‌ పెద్దవారు. రెండో సోదరుడు ప్రకాశ్‌ మహాజన్‌ ఔరంగాబాద్‌లో స్థిరపడ్డారు. చిన్న సోదరుడు ప్రవీణ్‌ మహాజన్‌ చిన్నపాటి కనస్ట్రక్షన్‌ వ్యాపారం ఉంది. ప్రమోద్‌ మహాజన్‌ ప్రవీణ్‌కు ఆ వ్యాపారంలో తోడ్పాటు అందిస్తుంటారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X