ప్రభుత్వ లాంఛనాలతో రేపు సూర్యనారాయణ అంత్యక్రియలు
హైదరాబాద్: ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ల అమానుషత్వానికి బలైన తెలుగు ఇంజినీర్ సూర్యనారాయణకు మంగళవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. సూర్యనారాయణ మృతదేహం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. సూర్యనారాయణ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సూర్యనారాయణ బంధువులు, మిత్రులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సూర్యనారాయణ ఉగ్రవాదుల దురాగతానికి బలైనందువల్ల ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన అంత్యక్రియల్లో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనబోతున్నారు.












Click it and Unblock the Notifications