వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వప్న ఎవరో తెలియదు: సూర్యానారాయణ తండ్రి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ కుమారుడు సూర్యనారాయణ భార్యనంటూ వచ్చిన స్వప్న ఎవరో తమకు తెలియదని ఆయన తండ్రి కాసుల చంద్రశేఖర్‌ అంటున్నారు. ఆల్‌ మొయద్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న కాసుల సూర్యనారాయణను అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు హత్య చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి భౌతికకాయాన్ని ఎవరైనా చూడవచ్చుని చంద్రశేఖర్‌ అన్నారు. స్వప్న సూర్యనారాయణను పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. దీంతో ఆమె పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

సూర్యనారాయణ అంతిమ యాత్ర సందర్భంగా స్వప్న అక్కడికి చేరుకుని అంతిమ యాత్రకు అడ్డం పడ్డారు. సూర్యనారాయణను కడసారి చూసేందుకు అవకాశం కల్పించాలని ఆమె పట్టుబట్టింది. అయితే ఆమెను పక్కకు తొలగించి అంతిమ యాత్రను ముందుకు నడపించారు. తాము అందించే సాయం ఇద్దరు భార్యలకు ఇవ్వాలా, ఒకరికి ఇవ్వాలా అనే విషయాన్ని హిందూ వివాహ చట్టం ప్రకారం నిర్ణయిస్తామని సూర్యనారాయణ పని చేసిన ఆల్‌ మొయద్‌ కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. తాము కల్పించిన భద్రతను సూర్యనారాయణ సరిగా వినియోగించుకోలేదని వారు చెబుతున్నారు. సూర్యనారాయణ రెండో వివాహం గురించి తెలిసిన మొదటి భార్య మంజుల ఫినాయిల్‌ తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X