రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం
హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలకు 11 మంది బలయ్యారు. వీరిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి గోకవరం వెళ్తున్న ఆటోను ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రహదారిపై జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇందులో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తిరుపతి నుంచి కర్నూలు వైపు వెళ్తున్న టెంపో ట్రాక్స్‌ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదం కూడా కర్నూలు జిల్లాలోనే జరిగింది. నందికొట్కూరు నుంచి కర్నూలు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని మరో భారీ వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.












Click it and Unblock the Notifications