ఫిఫాలో సంచలనం- నాకౌట్స్ లో నిరుపేద దేశం: హేమాహేమీలు చిత్తు

ఫిఫా ప్రపంచకప్ లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ దశలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నూతన ఇతిహాసాన్ని లిఖించింది. అట్లాంటా మెర్సిడెస్ బెంజ్ స్టేడియంలో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ నాకౌట్ దశకు అర్హత సంపాదించింది. ప్రపంచకప్ చరిత్రలోనే డీఆర్ కాంగో జట్టుకు ఇది మొట్టమొదటి మ్యాచ్ విజయం కావడం విశేషం.

ఈ చారిత్రాత్మక విజయంతో ఆ జట్టు ప్రతిష్టాత్మక రౌండ్ ఆఫ్ 32లో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. మ్యాచ్ ప్రారంభంలో ఉజ్బెకిస్తాన్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట మొదలైన తొలి 20 సెకన్లలోనే ఆ జట్టు కెప్టెన్ ఎల్డోర్ షోమురోడోవ్ గోల్ కొట్టాడు గానీ వీడియో అసిస్టెంట్ రెఫరీ రివ్యూలో అది ఆఫ్‌సైడ్‌గా తేలడంతో రద్దయింది. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా దూకుడు పెంచిన ఉజ్బెకిస్తాన్, 10వ నిమిషంలో మొదటి గోల్ సాధించింది.

DR Congo secure FIFA World Cup knockouts with Stunning comeback win over Uzbekistan With 3-1

కాంగో డిఫెండర్ ఆరోన్ వాన్ బిస్సాకా, గోల్ కీపర్ లయనల్ మ్పాసీల మధ్య సరైన అవగాహన లేకపోవడాన్ని షోమురోడోవ్ చక్కగా వాడుకుని గోల్ చేశాడు. ఆ తర్వాత డీఆర్ కాంగో కూడా ఎదురుదాడి తీవ్రతరం చేసింది. నథానీల్ సుమారు 25 మీటర్ల దూరం నుండి కొట్టిన అద్భుతమైన షాట్ గోల్‌గా మారినప్పటికీ, బిల్డప్‌లో ఫౌల్ జరిగిందనే కారణంతో రెఫరీ ఫెలిక్స్ జ్వాయెర్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ ద్వితీయార్థంలో ఆఫ్రికన్ జట్టు మరింత వ్యూహాత్మకంగా మైదానంలోకి దిగింది.

ఉజ్బెకిస్తాన్ డిఫెండర్ అబ్దుకోదిర్ ఖుసనోవ్ పెనాల్టీ ఏరియాలో యోవాన్ విస్సాను కిందపడేయటంతో కాంగోకు పెనాల్టీ దక్కింది. ఈ సువర్ణ అవకాశాన్ని విస్సా గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. డీఆర్ కాంగో విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో 78వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు మైదానంలో అద్భుతాన్ని సృష్టించారు. మెషాక్ ఎలియా అందించిన పాస్ ను ఫిస్టన్ మయేలే అత్యంత చాకచక్యంగా నెట్‌లోకి నెట్టడంతో కాంగో గెలుపు ముంగిట నిలిచింది.

ఆట చివర్లో యోవాన్ విస్సా మరో అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో తన ఖాతాలో రెండో గోల్ వేసుకుని జట్టుకు 3-1తో చారిత్రాత్మక విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గెలుపుతో ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 చేరిన డీఆర్ కాంగో సంబరాల్లో మునిగిపోయింది. ఆ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఈ రాత్రి చిరస్థాయిగా నిలిచిపోతుంది. తమ జట్టు తదుపరి దశలో మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడనుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఓటమితో ఉజ్బెకిస్తాన్ లీగ్ దశలోనే వైదొలగాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+