తాడేపల్లిగూడెంలో పోలీసు కాల్పుల్లో ఖైదీ మృతి
విజయవాడ: తాడేపల్లి గూడెంలో పోలీసు కాల్పుల్లో ఒక ఖేదీ మరణించాడు. ఖైదీ పారిపోవడానికి ప్రయత్నించడంతో కాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఖైదీ మరణించడాని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలను తాడేపల్లిగూడెం కోర్టులో హాజరు పరచడానికి తీసుకెళ్లుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో ఒక ఖైదీ ఏమార్చి తప్పించుకుని పారిపోయాడని, మరో ఖైదీ కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన ఒక ఖైదీ పడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ ఖైదీ మరణించినట్లు పోలీసులు చెప్పారు. మరణించిన ఖైదీ కోరుకొండ గ్రామానికి చెందిన వాసుదేవ ప్రసాద్ అని, రాజు అనే ఖైదీ పారిపోయాడని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
