గిరిజన సంక్షేమ శాఖకు హైకోర్టు అక్షింతలు
హైదరాబాద్: పోలీసు శాఖను ఎడా పెడా వాయించిన హైకోర్టు నేడు శనివారం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి పనితీరును తీవ్రంగా విమర్శించింది. వేతన సవరణ వివరాలను సరిగా కోర్టుకు సమర్పించకపోవడంపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై క్షమించాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కోర్టును అభ్యర్ధించారు. ఇలా ప్రతి అధికారీ అభ్యర్ధిస్తుంటే ఎలాగని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రతి అధికారి క్షమించాలంటూ కోరడం మామూలై పోయిందని, ఈ ధోరణి మారాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. 1998 లో గిరిజన సంక్షేమ శాఖలొ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించనందుకు నాగిరెడ్డిని హైకోర్టు ఆక్షేపించింది.












Click it and Unblock the Notifications