స్వస్థలాలకు బహ్రెయిన్ మృతుల శవాలు
చెన్నై: గత నెల 30వ తేదీ జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 16 మంది భారతీయుల శవాలు బుధవారం ఇక్కడికి చేరుకున్నాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌లో మృతదేహాలను చెన్నైకి తరలించారు. కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి వెంకటపతి, తమిళనాడు మంత్రులు పొన్ముడి, యం. ఆర్.కె. పన్నీర్‌సెల్వం, టి.యం. అంబరాసన్, సీనియర్ కాంగ్రెస్ నేత కుమారి ఆనందన్, మృతుల బంధువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బిల్డింగ్ వర్కర్ సంఘాల నాయకులు, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు విమానాశ్రయానికి వచ్చారు.
అనంతరం మృతదేహాలను కడలూరు, వెల్లుపురం, పెరంబులూరు జిల్లాల్లోని వారి వారి స్వస్థలాలకు ప్రత్యేక వాహనాల్లో పోలీసు ఎస్కార్టుతో పంపారు. మృతుల్లో ఏడుగురు కడలూరు జిల్లాకు, ఎనిమిది మంది వెల్లుపురం జిల్లాకు, ఒకరు పెరంబలూరు జిల్లాకు చెంనవారు.












Click it and Unblock the Notifications