పన్ను శాతం తగ్గించాలని రేస్ క్లబ్ వినతి
హైదరాబాద్, జులై 12: రాష్ట్రంలో గుర్రపు పందేల మీద పన్నును 10 శాతం నుంచి తగ్గించమని హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2006 వర్షాకాల రేసుల ప్రారంభాన్ని ఆయన ప్రకటిస్తూ రాష్ట్ర నుండి చాలా మంది పెద్ద పంటర్లు బెంగుళూరుకు వెళ్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు.
కర్నాటకలో బెటింగ్‌ల మీద పన్ను నాలుగు శాతం కాగా ఆంధ్రలో అది పది శాతం పైగా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల పెద్ద పంటర్లు రేసులు ఆడేందుకు బెంగుళూరును వేదికగా చేసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రం నుంచి సొమ్ము ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. పన్ను శాతాన్ని గనుక తగ్గిస్తే, అటు ప్రభుత్వానికి రెవిన్యూ పెరగడమే గాక ఇటు క్లబ్‌కు కూడా ఆదాయం పెరగగలదని సురేంద్రరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్నిఅభ్యర్ధించారు.
మ్యూజియం ఏర్పాటు
కాగా దేశంలో మొదటిసారిగా రేసుల మీద మ్యూజియంను హెచ్‌ఆర్‌సి ఏర్పాటు చేయదలచినట్టు ఆర్ సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే 20 అరుదైన వస్తువుల సేకరణ జరిగిందని, మ్యూజియం కోసం క్లబ్ ఆవరణలోనే 10 వేల చ అడుగుల హాలును నిర్మిస్తామని ఆయన చెప్పారు. రేసింగ్‌లో సంబంధిత మెమొంటో;లను, ఇతర వస్తువులను పంపించమని ప్రఖ్యాత రేసింగ్ వ్యాఖ్యాత జంగ్ క్లబ్ తరఫున కోరారు.












Click it and Unblock the Notifications