వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్డి సంతకాలు చేయడంలో చిన్నా డాక్టరేట్‌: నాగం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించిన లేఖపై తాను చూడకుండానే సంతకం చేశానని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) కన్వీనర్‌ డాక్టర్‌ జి. చిన్నారెడ్డి అనడాన్ని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉప నాయకుడు డాక్టర్‌ నాగం జనార్దన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. మరణించిన స్వర్గీయ బాగారెడ్డి మీద నెపం పెట్టి తప్పించుకోజూడడం చిన్నారెడ్డికి తగదని ఆయన అన్నారు. చదవకుండా సంతకాలు చేసే చిన్నారెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది వస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డిని సైమన్‌గా అభివర్ణించిన చిన్నారెడ్డి మంత్రి పదవి కోసం తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని అంటున్నారని ఆయన అన్నారు.

చిన్నారెడ్డి దేనిలో డాక్టరేట్‌ తీసుకున్నారని, చదవకుండా సంతకాలు చేయడంలో డాక్టరేటు తీసుకున్నారా? అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డియస్‌) తూములను తెరిచే ఆదేశాలపై తాను చూడకుండానే సంతకం చేశానని గతంలో చిన్నారెడ్డి అన్నారని, ఇప్పుడు తెలంగాణ కోరుతూ సోనియా సమర్పించిన లేఖపై చదవకుండా సంతకం చేశానని అంటున్నారని, చిన్నారెడ్డిని కమిటీల్లో వేస్తే ఏమవుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X