అనుమానాస్పద స్థితిలో గర్భిణీ స్త్రీ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందులో ఒక గర్భిణీ స్త్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతికి అత్తింటివారే బాధ్యులని ఆరోపిస్తూ స్థానికులు వారిని చితకబాదారు. అదనపు కట్నం కోసం వేధించి ఆమెను చంపారని వారు ఆరోపించారు. అంతేకాకుండా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
విశాఖపట్నం నివాసి పూర్ణిమ ఇల్లందు నివాసి సలీం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అత్తింటివారు పూర్ణిమను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారనే ఆరోపణలున్నాయి. పది రోజుల క్రితం రంజాన్ కోసం విశాఖపట్నం నుంచి ఇల్లందు వచ్చింది. గత రాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది.












Click it and Unblock the Notifications