ఖమ్మం, ఆదిలాబాద్‌ల్లో పత్తి రైతుల ఆందోళన
ఖమ్మం/ ఆదిలాబాద్: గిట్టుబాటు ధర డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్, ఖమ్మం మార్కెట్ యార్డుల్లో పత్తి రైతులు మంగళవారంనాడు అందోళనకు దిగారు. ఖమ్మం మార్కెట్ యార్డుకు పత్తిరైతులు తాళాలు వేసి ధర్నాకు దిగారు. దళారుల పెత్తనం, వ్యాపారుల మోసం, అధికారుల నిర్లక్ష్యం వంటి కారణాలకు ఆగ్రహం చెందిన రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాల్ 1200 నుంచి 1600 రూపాయలు మాత్రమే మాత్రమే చెల్లిస్తామని వ్యాపారులు చెప్పడాన్ని పత్తిరైతులు నిరసించారు. 2050 రూపాయల మార్కెట్ రేటు వుంటే తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడాన్ని వారు నిరసించారు.
అటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు అధికారులను నిర్బంధించి వాగ్వివాదానికి దిగారు. పత్తికి తక్కువ ధర చెల్లిస్తామని చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. మార్కెట్ రేటు క్వింటాల్‌కు 2021 రూపాయలు వుండగా 1950 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని వ్యాపారులు మొండికేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 2010 రూపాయలు చెల్లించడానికి ముందుకు రావడంతో రైతులు చల్లబడ్డారు.












Click it and Unblock the Notifications