రాజీనామా కేశవరావు ఇష్టం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: పిసిసి పదవికి రాజీనామా చేసే విషయాన్ని కె. కేశవరావుకే వదిలేస్తున్నామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాజీనామా విషయాన్ని కేశవరావు విజ్ఞతకు వదిలేస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంటిలో ప్రశాంత్ రెడ్డి మృతి సంఘటన రాజకీయాలకు సంబంధించింది కాదని, వ్యక్తిగతమైందని ఆయన అన్నారు. అయితే తాను కేశవరావుతో మాట్లాడలేదని ఆయన చెప్పారు.
ఆ ఘటన విషయంలో కేశవరావు తప్పేమీ లేదని, అయితే తన కుమారుడు వెంకట్ ను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత కేశవరావుకు ఉందని ఆయన అన్నారు. గతంలో కూడా వెంకట్ పై ఇటువంటి వివాదంలో చిక్కుకున్నాడని ఆయన వాలీబాల్ ఆటగాడు రవికాంత్ రెడ్డి ఉదంతాన్ని గుర్తు చేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications