ఫ్లై వోవర్ ప్రమాదం, మునిసిపల్ ఇంజినీర్ల సస్పెన్షన్
హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైవోవర్ కూలిన సంఘటనపై ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఉన్నతాధికారులపై ఆయన ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సంబంధిత మునిసిపల్ ఇఇ, డిఇ, ఎఇ లను సస్పెండ్ చేశారు.
ప్రమాద స్ధలంలో మరో మృతదేహాన్ని సోమవారం ఉదయం వెలిపితీశారు. దీనితో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 5 కు పెరిగింది. ఈ సంఘటనపై విచారణకు దుగురు సభ్యులు ఉన్న కమిటీని నియమించినట్టు మునిసిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు ప్రకటించారు. ఈ సంఘటనలో మృతులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.












Click it and Unblock the Notifications