కేశవరావు కొడుకుపై హత్యాయత్నం కేసు, అరెస్టులో జాప్యం
హైదరాబాద్: వివాదాస్పదుడైన పిసిసి అధ్యక్షుడు కె.కేశవరావు కుమారుడు కె.వెంకట్ పై ఆదివారం హత్యాయత్నం కేసు నమోదైంది. వెంకట్ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో రియల ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డిని జూబిలీహిల్స్ ఉన్న తన నివాసంలో తుపాకితో కాల్చి చంపినట్టు కేసును పోలీసులు రికార్డు చేశారు.
ఇది హత్య కాదని కేశవరావుతో సహా వెంకట్ కుటుంబీకులు బుకాయిస్తుండగా, ఇది ముమ్మాటికీ హత్యేనని ప్రశాంత్ రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి కుడి కణతపై రివాల్వర్ గాయాలు ఉండడం, ఆ రివాల్వర్ వెంకట్ ది కావడం గమనార్హం. సంఘటన జరగడానికి ముందు వెంకట్ ఇంట్లో ఇద్దరూ మద్యం సేవించి ఉండడం, అనేక విషయాల్లొ ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు.
కాగా వెంకట్ జరిపినట్టు భావిస్తున్న కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి మరణించగా, వెంకట్ అపస్మారక స్ధితిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఎటువంటి గాయాలు లేకుండా వెంకట్ ఎలా అపస్మారప స్ధితిలోకి వెళ్తాడని ప్రతిపక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంకట్ ను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేయడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు.












Click it and Unblock the Notifications