కేసును సిబిఐకి అప్పగించాలి: ప్రశాంత్ భార్య
హైదరాబాద్: వెంకట్ పై ప్రశాంతరెడ్డి భార్య విలాసిని తీవ్రంగా మండిపడ్డారు. తన భర్త ప్రశాంత్ రెడ్డిని వెంకట్ హత్య చేశాడని, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ ఘటనను సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆమె డిమాండు చేశారు. భూవివాదం గురించి మాట్లాడుదామని పిలిపించిన వెంకట్ తన భర్తను హత్య చేశాడని ఆమె అన్నారు. వెంకట్ కు లేని వ్యసనమంటూ లేదని ఆమె వ్యాఖ్యానించారు. తన కొడుకును కేశవరావు అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని ఆమె అన్నారు. పది రోజులుగా ఒక భూవివాదం కొనసాగుతోందని ఆమె చెప్పారు. కేసును తప్పు తోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ పై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మృతుడు ప్రశాంతరెడ్డి తండ్రి రాఘవేంద్ర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చేరిన వెంకట్ ను ఒక గది నుంచి మరో గదిలోకి మార్చారు. సంఘటనపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications