సోనియాను కలిశాకే కెకె భవిష్యత్తు: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాతనే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన డాక్టర్ కె. కేశవరావు భవితవ్యం తేలుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. కుమారుడు వెంకట్ ఇంట్లో జరిగిన కేశవరావును ఎలా తప్పు పడతామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతిభ ఆధారంగానే కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్ష పదవిని ఆశించి ఎవరూ ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, లాబీయింగ్ ద్వారా పదవి వస్తుందనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. అందరితో చర్చించిన తర్వాతనే కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్ష పదవిని ఆశించి రాష్ట్ర కాంగ్రెసు నాయకులు ఢిల్లీ వస్తున్నట్లు తనకేమీ సమాచారం లేదని ఆయన అన్నారు. కేశవరావు రాజీనామాను ఆమోదించడం లాంఛనప్రాయమేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
