నకిలీ స్టింగ్ ఆపరేషన్, ముగ్గురి అరెస్టు
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో ముగ్గ్గురు ఎంపీలపై నకిలీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రామేశ్వర్ ఒరాన్ ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరి నాయకుడు సంజయ్ తివారీ పరారీలో ఉన్నాడు.
ఎంపీలను కలిసి తాను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శినని, వారికి 18 కోట్ల కాంట్రాక్టులు ఇప్పిస్తానని చెప్పారు. అడ్వాన్సుగా 5అవేలు ఇవ్వమని, పని అయ్యాక 5 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఇతని తీరును అనుమానించిన ఎంపీ పోలీసులకు తెలియజేసి, ఇతడిని పిలిపించాడు. అతను మాట్లాడుతుండగా అతని సహచరులు రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
