హైద్రాబాద్ వద్ద శిక్షణ విమానం కూలి ఇద్దరి మృతి
హైదరాబాద్: భారత వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం హైదరాబాద్ శివారు హకీంపేటలో మంగళవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ సంఘటనలో శిక్షకుడు భగత్, శిక్షణ పొందుతున్న ట్రైనీ పైలట్ పతి మృతి చెందారు. ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ అకాడమీ విద్యార్ధులు రాత్రి వేళల్లో, తెల్లవారు జామున శిక్షణలో భాగంగా విమానాలు నడుపుతుంటారు. అదే విధంగా ఈ తెల్లవారుజామున వీరు గగనతలంలో శిక్షణకు వెళ్ళారు. సాంకేతిక లోపాల కారణంగా విమానం కూలిపోయింది. మంటల్లో మృతదేహాలు మాడి మసై పోయాయి. ట్రైనర్ భగత్ భార్య కూడా ఇదే అకాడమీలో పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications
