ఎసిబికి చిక్కిన ఇద్దరు అధికారులు
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ముత్తయ్య ఇంటిపై దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు
దాడి చేశారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. ముత్తయ్యకు 25 ఇళ్ళ స్ధలాలు, రెండు ఇళ్ళు ఉన్నట్టు ఎసిబి అధికారులు చెప్పారు. వీటి విలువ డాక్యుమెంట్ల ప్రకారం 75 లక్షల రూపాయలు. హైదరాబాద్ వనస్ధలిపురంలోని ముత్తయ్య ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం వరకు సోదాలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లాకు చెందిన తహసీల్దారు జెవి ప్రభాకరరావు 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఒక మాజీ సైనికుడికి భూమి కేటాయించడానికి తహసీల్దారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేయగా, బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. అతడి ద్వారా వలపన్నిన అధికారులు ప్రభాకరరావును పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications
