610 జీవో సమావేశానికి ఆంధ్ర ఎమ్మెల్యేల గైర్హాజరు
హైదరాబాద్: తెలంగాణకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ చేసిన 610 జీవో అమలుపై ఏర్పాటైన సభా సంఘం శుక్రవారంనాడు సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు హాజరు కాలేదు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు.
ఇదిలా ఉంటే, 610 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉపాధ్యాయుల ఫెడరేషన్ (టిటిఎఫ్) సచివాలయం ఎదురుగా గల తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సచివాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications
