హైద్రాబాద్ లో మళ్ళీ భారీ వర్షం
హైదరాబాద్: శనివారం ఉదయం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమాజిగుడ, న్యూ బోయిగుడా, మక్తా బండ్లగుడ, సికింద్రాబాద్ లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, మురికివాడల్లో నీరు నిలిచింది.
వర్షం వల్ల బ్రిడ్జిలు ఎక్కడ కూలుతాయోనన్న భయంతో వాహనదారులు ఓవర్ బ్రిడ్జిల వద్ద వేగంగా వెళ్ళడం కన్పించింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్ళే ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.












Click it and Unblock the Notifications
