ప్రశాంత్ కేసు: వెంకట్ ఇంటిలో సిఐడి సోదాలు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంటిలో సిఐడి పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వెంకట్ ఇంటి నుంచి పోలీసులు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బుల్లెటును, ఇతర పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాల్పులకు వాడిన రివాల్వర్ ఏమైందీ, ఎవరు తీసుకెళ్లారు వంటి వివరాలను పోలీసులు వెంకట్ భార్య దివ్యను అడిగి తెలుసుకున్నారు. సోదాలు నిర్వహించే సమయంలో పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. సోదాల వివరాల గురించి సిఐడి పోలీసులు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. వెంకట్ ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిఐడి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications
