వెంకట్ కేసు: సోమవారం నిర్ణయం
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు కేశవరావు కుమారుడు వెంకట్ ను విచారించేందుకు సిఐడి పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్ధానం సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. ఈనెల 8న వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనకు వెంకట్ బాధ్యూడని పేర్కొంటూ, ప్రశాంత్ రెడ్డి కుటుంబసభ్యులు జూబిలీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో వెంకట్ ను అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచగా న్యాయస్ధానం రిమాండ్ కు ఆదేశించింది.
ఇలా ఉండగా కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. నిందితుడిని విచారించేందుకు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వవలసిందిగా సిఐడి న్యాయస్ధానాన్ని కోరింది. దీనిపై సోమవారం న్యాయస్ధానం తుది నిర్ణయం ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications
