అందరికీ ఇళ్లు మా ధ్యేయం: వైయస్
రాజమండ్రి: రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఇందిరమ్మ గ్రామాల ఎంపిక ద్వారా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఇంటింటా ఇందిరమ్మ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని ఎస్. అన్నవరం గ్రామంలో పర్యటించారు. అక్కడ ఏర్పాటైన గ్రామసభలో ప్రసంగించారు. నిరుడు మూడో వంతు గ్రామాలను, ఈ ఏడాది మూడో వంతు గ్రామాలను ఇందిరమ్మ గ్రామాలుగా ఎంపిక చేశామని, ఈ ఏడాది మిగతా గ్రామాలను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు.
ఇంటింటా ఇందిరమ్మ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్టంలో గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎవరూ చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
