తెలంగాణ, సీమల్లో భారీ వానలు: అపార నష్టం
హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు జయమయమయ్యాయి. రహదారులు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తాలో ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని నడికుడి వాగులో లారీ కొట్టుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవరును, క్లీనరును రక్షించారు. కాకతీయ కాలువలో ఒక యువకుడు కొట్టుకుపోయాడు. హుస్నాబాద్ మండలంలో నాలుగు గ్రామాలకు బస్సుల రాకపోకలు బందయ్యాయి. నాలుగు చెరువులకు గండ్లు పడ్డాయి.
వరంగల్ - హైదరాబాదు జాతీయ రహదారిలో నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద డైవర్షన్ వంతెల కూలిపోయింది. నల్లగొండ జిల్లాలోనూ పలు ప్రాంతాలు జలమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కనగల్ వద్ద రోడ్డు తెగిపోయింది. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. తుంగభద్ర నది పొంగిపొర్లుతోంది. కర్నూలు జిల్లాలో వరదలకు ఆరుగురు మరణించినట్లు సమాచారం. 36 గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నెల్లూరు జిల్లాలోనూ వర్షం ప్రభావం తీవ్రంగానే ఉంది. వర్షాల పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల తన మూడు జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications